
సినిమాలు

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు పతకం ఖాయం చేసుకుంది. జపాన్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్ 3-0తో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. సింగిల్స్‌లో లక్ష్యసేన్ విజయం సాధించగా, డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ, సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి గెలిచి భారత్‌కు విజయాన్ని అందించారు.
మరోవైపు భారత మహిళల జట్టు క్వార్టర్‌ఫైనల్లో జపాన్ చేతిలో 1-3తో ఓడి పోటీ నుంచి నిష్క్రమించింది. సింగిల్స్‌లో పీవీ సింధు, ఉన్నతి హుడా ఓడిపోవడంతో భారత్ 0-2తో వెనుకబడింది. అనంతరం డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి గోపిచంద్ జోడీ విజయం సాధించి భారత్ ఆశలను నిలిపింది. అయితే నాలుగో మ్యాచ్‌లో తన్వీ శర్మ ఓడిపోవడంతో భారత జట్టు పరాజయం ఖరారైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!