

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మయామిలో తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులను మరింత విస్తరించారు. 2023లో ఫోర్ట్ లాడర్‌డేల్‌లోని బే కాలనీలో రూ. విలువ పరంగా సుమారు 10.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన ఇంటి పక్కనే తాజాగా మరో ఇంటిని సుమారు 8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తొలి ఇంటిలో ఎనిమిది బెడ్‌రూమ్‌లు, సుమారు 10,400 చదరపు అడుగుల విస్తీర్ణం, 170 అడుగుల నీటి ముఖద్వారం ఉన్నాయి.
పక్కనున్న రెండు ఆస్తులను కలిపి వినియోగించుకోవడం ద్వారా మెస్సీకి మరింత విస్తృతమైన ప్రైవేట్ స్థలం, నీటి ముఖద్వారం లభించనుంది. తమ ఇంటి పక్కనే ఉన్న ఆస్తిని కొనుగోలు చేసి చుట్టుపక్కల స్థలంపై నియంత్రణ పెంచుకునే ఈ విధానాన్ని రియల్ ఎస్టేట్‌లో ‘ల్యాండ్‌మ్యాక్సింగ్’గా పిలుస్తున్నారు. మయామి ప్రాంతంలో మెస్సీకి ఇప్పటికే పలు విలాసవంతమైన నివాస ఆస్తులు ఉన్నాయి. ఇటీవల సిప్రియాని రెసిడెన్సెస్ మయామిలోనూ ఆయన నాలుగు కాండో యూనిట్లను కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!