
రాజకీయాలు

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ ఆర్చరీ క్రీడాకారిణి చికితా తానిపర్తి అరుదైన ఘనత సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన చికిత సాహిల్ జాదవ్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ బంగారు పతకం గెలుచుకుంది. మిక్స్డ్ టీమ్‌లో సాధించిన విజయం ద్వారా భారత్‌కు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు కాంపౌండ్ ఆర్చరీలో కోటా స్థానం లభించింది.
చికితా తానిపర్తి సాధించిన రెండు స్వర్ణ పతకాలపై తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిన చికిత రాష్ట్రంలోని ఇతర క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!