

ఐసీసీ తాజా టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారి కెరీర్‌లో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మాకేలో జరిగిన రెండో టెస్టులో స్టార్క్ 10 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/12, రెండో ఇన్నింగ్స్‌లో 4/39తో అద్భుత ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాకు ఇన్నింగ్స్ 51 పరుగుల విజయాన్ని అందించాడు. దీంతో స్టార్క్ 872 రేటింగ్ పాయింట్లకు చేరుకోగా, బుమ్రా 862 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.
బుమ్రా తాజా విడతలో రెండు నెలల పాటు నంబర్‌వన్‌గా కొనసాగాడు. మొత్తంగా 697 రోజులు టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి భారత బౌలర్లలో అరుదైన రికార్డు సాధించాడు. మరోవైపు టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషభ్ పంత్ ఏడాది విరామం తర్వాత టాప్-10లోకి తిరిగి వచ్చాడు. ఆరు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నంబర్‌వన్ స్థానాన్ని కొనసాగిస్తుండగా, జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!