

వన్డే ప్రపంచకప్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఇక ప్రయోగాలకు పెద్దగా అవకాశం లేదని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే అనంతరం మాట్లాడిన గిల్.. వచ్చే సిరీస్ నుంచి ప్రపంచకప్ జట్టులో ఉండే అవకాశమున్న ఆటగాళ్లకు క్రమం తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని తెలిపాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి ప్రధాన బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో భారత బౌలింగ్ బలహీనంగా కనిపించింది. రెండో వన్డే సందర్భంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయపడటం కూడా జట్టుకు ఎదురుదెబ్బగా మారింది.
ప్రధాన బౌలర్లు తరచూ తుది జట్టుకు దూరం కావడం అసహనం కలిగిస్తోందని గిల్ పేర్కొన్నాడు. తాము కోరుకున్న బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగలేకపోవడం దురదృష్టకరమని చెప్పాడు. అయితే ఇదే సమయంలో కొత్త బౌలర్లకు తమ సత్తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో పవర్‌ప్లే, ఆఖరి ఓవర్లలో బౌలింగ్ తమను తీవ్రంగా దెబ్బతీసిందని గిల్ తెలిపాడు. పవర్‌ప్లేలో వికెట్లు సాధించకపోతే మధ్య ఓవర్లలో వికెట్లు తీయడం మరింత కష్టమవుతుందని, దీంతో ప్రత్యర్థి భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంటుందని వివరించాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!