

2026 ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్ ప్రాచీ చౌదరి సత్తా చాటింది. మహిళల 400 మీటర్ల ఫైనల్లో 53.21 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని సాధించింది. ఏషియన్ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో ప్రాచీకి ఇదే తొలి పతకం. బహ్రెయిన్‌కు చెందిన సల్వా నాజర్ 49.20 సెకన్లతో గేమ్స్ రికార్డుతో స్వర్ణం సాధించగా, ఇరాన్‌కు చెందిన జహ్రా జరీ మనూజన్ 52.38 సెకన్లతో రజతం గెలుచుకుంది. పతకం అనంతరం సల్వా నాజర్‌తో కలిసి ప్రాచీ ఫొటో దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తొలి హీట్‌లో ప్రాచీ 53.46 సెకన్లలో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ దక్కకపోయినా, వేగవంతమైన నాన్-ఆటోమేటిక్ క్వాలిఫయర్లలో ఒకరిగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్లో తన ప్రదర్శనను మెరుగుపరుచుకుని కాంస్య పతకం దక్కించుకుంది. మరో భారత అథ్లెట్ కిరణ్ పహల్ 53.41 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. ప్రాచీ మహిళల 4x400 మీటర్ల రిలేలోనూ బరిలోకి దిగనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!