

జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వర్షం కారణంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కొంత తగ్గడంతో ఆటగాళ్లు మైదానంలోకి వచ్చినప్పటికీ, కవర్లు తొలగించకముందే మరోసారి వర్షం మొదలైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో అంపైర్లు, అధికారులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్ ముందంజలో ఉండటంతో టీమిండియా నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.
గతంలో హ్యాంగ్జౌ ఆసియా క్రీడల్లోనూ వర్షం కారణంగా భారత్ మ్యాచ్ రద్దై, ర్యాంకింగ్స్ ఆధారంగా భారత జట్టు స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగోయాలోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు నిరాశ ఎదురైంది. మరోవైపు, మ్యాచ్ లేకపోవడంతో భారత క్రికెటర్లకు కొంత విశ్రాంతి లభించనుంది. ఆసియా క్రీడల్లో వివిధ విభాగాల్లో పోటీపడుతున్న భారత అథ్లెట్లను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ప్రోత్సహించే అవకాశం కూడా క్రికెటర్లకు దక్కనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!