

ది ప్యారడైజ్లో నానికి తల్లిగా సోనాలి కులకర్ణి కనిపించడంతో ఆమె కెరీర్లోని ఓ ఆసక్తికరమైన అంశం మరోసారి చర్చలోకి వచ్చింది. 2000లో విడుదలైన మిషన్ కశ్మీర్ చిత్రంలో ఆమె హృతిక్ రోషన్కు తల్లిగా నటించారు. అప్పటికి సోనాలి వయసు కేవలం 25 ఏళ్లు కావడం విశేషం. స్టార్ హీరోకు ఇంత చిన్న వయసులోనే తల్లి పాత్రలో కనిపించిన ఆమె, ఆ తర్వాత విభిన్నమైన పాత్రలతో తన నటనా ప్రయాణాన్ని కొనసాగించారు.
దిల్ చాహ్తా హై, ప్యార్ తునే క్యా కియా వంటి చిత్రాల్లో హీరోయిన్గా మెప్పించిన సోనాలి, 2019లో వచ్చిన భారత్లో సల్మాన్ ఖాన్కు తల్లిగా నటించారు. ఆసక్తికరంగా, ఆ సమయంలో ఆమె సల్మాన్ కంటే తొమ్మిదేళ్లు చిన్నవారు. పాత్రకు అవసరమైన వయసును తన నటనతో నమ్మించగలగడం సోనాలి ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇప్పుడు ది ప్యారడైజ్లో నానికి తల్లిగా కనిపించడం ఆమె సుదీర్ఘ కెరీర్లో మరో ప్రత్యేకమైన పాత్రగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!