

మోటార్ వాహనాల చట్టం, 1988 ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో నడిచే వాహనాలకు థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. వాహనం వల్ల ఇతరులకు గాయం, మరణం లేదా ఆస్తి నష్టం జరిగినప్పుడు ఏర్పడే చట్టపరమైన, ఆర్థిక బాధ్యతల నుంచి వాహన యజమానికి ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. పార్లమెంట్‌కు ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం 2026 మార్చి 6 నాటికి దేశ రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో 44.31 శాతానికి చెల్లుబాటు అయ్యే బీమా లేదు. అయితే థర్డ్ పార్టీ బీమా ఇతరులకు కలిగిన నష్టాల బాధ్యతను మాత్రమే కవర్ చేస్తుంది. సొంత వాహనానికి జరిగిన నష్టాలకు ఓన్ డ్యామేజ్ లేదా సమగ్ర బీమా అవసరం.
దీర్ఘకాలిక థర్డ్ పార్టీ బీమా తీసుకోవడం వల్ల తరచూ పాలసీని పునరుద్ధరించాల్సిన అవసరం తగ్గడంతో పాటు, బీమా గడువు ముగిసే అవకాశాలను నివారించుకోవచ్చు. అయితే వాహనానికి బీమా ఉండటంతోనే రహదారి భద్రత పూర్తవదు. వాహనానికి అవసరమైన పత్రాలు చెల్లుబాటులో ఉండటం, డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండటం, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం కూడా ముఖ్యమే. తప్పనిసరి థర్డ్ పార్టీ బీమా నిబంధనల అమలును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వాహన్ డేటాబేస్‌తో అనుసంధానించిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు వ్యవస్థల వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!