

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ అండ్ వార్ నుంచి ఆలియా భట్ ఫస్ట్ లుక్‌ను తాజాగా అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమా హీరోహీరోయిన్ల లుక్స్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ ఎయిర్ ఫోర్స్ తరహా దుస్తుల్లో ఉన్న ఫొటోలు, ఆలియా రెట్రో లుక్‌కు సంబంధించిన చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలియాను క్యాబరే డ్యాన్సర్‌గా పరిచయం చేస్తూ భన్సాలీ విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. రెడ్ సీక్విన్ ఔట్‌ఫిట్‌లో ఆలియా కనిపించిన ఈ లుక్‌పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
అధికారిక ఫస్ట్ లుక్ విడుదలైన కొన్ని గంటల్లోనే సాంగ్ మేకింగ్ వీడియో లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆలియా డ్యాన్స్ మూమెంట్స్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తుండగా, మరికొందరు పోస్టర్ స్టైలింగ్‌ను కియారా అద్వానీ నటిస్తున్న టాక్సిక్ ఫస్ట్ లుక్‌తో పోలుస్తున్నారు. గంగూబాయి కాఠియావాడి తర్వాత ఆలియా, సంజయ్ లీలా భన్సాలీ కలిసి పనిచేస్తున్న చిత్రం కావడంతో లవ్ అండ్ వార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!