

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెరదించారు. రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇప్పటికే టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన అతడు.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఇంగ్లాండ్‌పై చివరిగా 138 పరుగులు చేశాడని సైకియా పేర్కొన్నారు. అలాంటప్పుడు అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని అన్నారు.
బీసీసీఐ సమీక్ష సమావేశంలో భారత ఆటగాళ్లకు తరచూ గాయాలు కావడం, కోలుకోవడంలో జాప్యం వంటి అంశాలపైనా చర్చించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, టీమ్‌ఇండియా మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని సైకియా స్పష్టం చేశారు. ఆటగాళ్లపై మ్యాచ్‌ల భారం తగ్గించేందుకు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పర్యటనల్లో మరిన్ని సన్నాహక మ్యాచ్‌లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమావేశానికి హాజరు కాకపోవడానికి ఆలస్యంగా సమాచారం అందడమే కారణమన్నారు. ఆయన పదవీకాలం పొడిగింపు, వీవీఎస్ లక్ష్మణ్‌ను క్రికెట్ డైరెక్టర్‌గా నియమించే అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!