

కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు రాధాకృష్ణుల దివ్య ప్రేమకథను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘అవనే శ్రీమన్నారాయణ’ ఫేమ్ దర్శకుడు సచిన్ రవి దర్శకత్వం వహించనున్నట్లు టాక్. రాధాకృష్ణుల శాశ్వత ప్రేమకథను గొప్పగా చూపించాలన్న కరణ్ జోహార్ కల ఈ చిత్రంతో నెరవేరనున్నట్లు సమాచారం.
సరైన స్క్రిప్ట్ సిద్ధం కావడంతో ప్రస్తుతం చిత్రబృందం ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణుడి జననం నుంచి కంస వధ వరకు ఆయన ప్రయాణాన్ని చూపించడంతో పాటు, రాధాకృష్ణుల అమర ప్రేమను ప్రధానంగా హైలైట్ చేయనున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ ప్రొడక్షన్ డిజైన్, హృదయాన్ని హత్తుకునే సంగీతంతో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నటీనటుల ఎంపికను గోప్యంగా ఉంచుతున్నారని, శ్రీకృష్ణుడు, రాధ పాత్రల్లో ఎవరు కనిపిస్తారనే దానిపై సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!