

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి దాదాపు 13 ఏళ్లు గడిచినా సచిన్ తెందుల్కర్ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. 'క్రికెట్ దేవుడు'గా అభిమానుల ఆదరణ పొందిన సచిన్ ఇప్పటికీ దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లకు అత్యంత ప్రాధాన్యమైన అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025 నివేదిక ప్రకారం ఆయన బ్రాండ్ విలువ దాదాపు రూ.1,200 కోట్లుగా అంచనా వేయబడింది. రిటైర్ అయిన క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన వ్యక్తిగా సచిన్ మరోసారి తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
2013లో 24 ఏళ్ల అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన సచిన్ ఇప్పటికీ ప్రకటనల ప్రపంచంలో తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నారు. భారతదేశంలోని టాప్ సెలబ్రిటీల్లో అత్యధిక బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా కొనసాగుతున్న ఏకైక రిటైర్డ్ క్రీడాకారుడిగా ఆయన నిలిచారు. ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసం, నమ్మకం, విశ్వసనీయత కారణంగానే ప్రతి ఏడాది ఆయన బ్రాండ్ విలువ పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అనేక మంది స్టార్ క్రీడాకారులు ఉన్నప్పటికీ ప్రముఖ కంపెనీలు ఇప్పటికీ సచిన్‌తో భాగస్వామ్యం చేసేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!