
జనరల్

వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో కుండపోత వాన పడగా, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్‌నగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదవుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
నగరంలో సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది. వర్షం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు రహదారులపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!