

భారత పురుషుల జట్టు వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ ఐసీసీ సెప్టెంబర్ నెల ఉత్తమ ప్లేయర్ అవార్డులను గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని శుభ్మన్ గిల్ అందుకోవడం ఐదోసారి కావడం విశేషం. వెస్టిండీస్కు చెందిన హేలీ మాథ్యూస్ తర్వాత ఐదుసార్లు ఈ అవార్డును అందుకున్న ఆటగాడిగా గిల్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఆయన మరోసారి ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
మహిళల ఆసియా కప్లో అద్భుతంగా రాణించిన 22 ఏళ్ల షెఫాలీ వర్మ 360 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలవడంతో పాటు ఆరు వికెట్లు కూడా పడగొట్టారు. గతేడాది నవంబర్లోనూ ఆమె ఐసీసీ ఉత్తమ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు ఒకేసారి ఈ అవార్డులను అందుకోవడం ఐదోసారి కాగా, భారత్కు ఇది మూడోసారి. గతంలో 2024లో జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన, 2025లో అభిషేక్ శర్మ, స్మృతి మంధాన ఈ ఘనత సాధించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!