

శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి గాల్ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ప్రాక్టీస్ తర్వాత లభించిన ఖాళీ సమయాన్ని సరదాగా గడుపుతున్న ఆటగాళ్లు.. మ్యాచ్‌కు ముందు సరికొత్త లుక్‌లో కనిపించేందుకు శ్రీలంకలోని ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ చతురంగ సెలూన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ సరదాగా ట్రిమ్మర్ చేతపట్టి సర్ఫరాజ్ ఖాన్‌కు హెయిర్‌కట్ చేసేందుకు ప్రయత్నించడం నవ్వులు పూయించింది.
సర్ఫరాజ్ కుర్చీలో కూర్చోగానే సిరాజ్ ట్రిమ్మర్ తీసుకుని హెయిర్‌కట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ట్రిమ్మర్‌ను ఉపయోగించే ముందు దాని సెట్టింగ్స్ గురించి స్టైలిస్ట్ చతురంగను అడిగి తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. అనంతరం సర్ఫరాజ్ జుట్టుపై తన చేతివాటం చూపించాడు. చివరకు ప్రొఫెషనల్ స్టైలిస్ట్ చతురంగనే హెయిర్‌కట్‌ను పూర్తి చేశాడు. ఈ సరదా సమయంలో రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ తదితరులు కూడా పాల్గొనగా.. పంత్, సర్ఫరాజ్ స్టైలిస్ట్ పనితనాన్ని అభినందించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!