
క్రీడలు

తెలంగాణ కు చెందిన కరాటే క్రీడాకారులు డెహ్రాడూన్‌లో జరిగిన 5వ కేఐవో జాతీయ క్యాడెట్, జూనియర్, అండర్-21 కరాటే చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబర్చారు. పురుషుల జూనియర్ కుమిటె 60 కిలోల విభాగంలో అమ్రాది విశాల్ రెడ్డి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని తెలంగాణకు గర్వకారణంగా నిలిచాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను అధిగమించి అతడు ఈ ఘనత సాధించాడు.
మరోవైపు మహిళల క్యాడెట్ కాటా విభాగంలో తలపత్రి ఆరాధ్య కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ర్యాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఈ ఇద్దరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. వారి విజయాలు తెలంగాణ కరాటే రంగానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!