
క్రీడలు

తెలంగాణకు చెందిన జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ జట్టుకు ఎంపికైంది. ఎన్నో సంవత్సరాలుగా క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర కృషితో సాధించిన ఈ ఘనత తెలంగాణ క్రీడారంగానికి గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం నిష్కాకు దక్కింది.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిష్కా అగర్వాల్, ఆమె కోచ్ మనోజ్ రాణా, సహాయక బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఆమె ప్రతిభ, పట్టుదల దేశవ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంది. కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి భారత్‌కు పతకాలు అందించడంతో పాటు తెలంగాణకు మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!