

తమిళనాడులో ఇండియా కూటమిలో విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు అంశంపై కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా కొనసాగవచ్చని సూచించగా, కాంగ్రెస్ దీనికి మద్దతు తెలిపింది. అయితే డీఎంకే మాత్రం ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది.
డీఎంకే ఎంపీ గణపతి పి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం డీఎంకేకు దూరమైందని ఆరోపించారు. వీసీకేను మధ్యవర్తిగా ఉపయోగించి మళ్లీ డీఎంకేను ఒప్పించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. పార్లమెంట్లో ప్రస్తుతం ఒక్క ఎంపీ కూడా లేని టీవీకేను ఇండియా కూటమిలో భాగంగా పరిగణించాలా అనే అంశంపై కూడా చర్చ అవసరమని అభిప్రాయపడ్డారు. సిద్ధాంతపరంగా బీజేపీయే డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అని పేర్కొంటూ, డీఎంకే–కాంగ్రెస్ మధ్య సంబంధాలు పునరుద్ధరించడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!