

సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ ఆదివారం విడుదలైంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రషా థడానీ కథానాయికగా నటించగా, మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమిని కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్‌ను పరిశీలిస్తే గాఢమైన ప్రేమకథను శక్తివంతమైన యాక్షన్‌తో మేళవిస్తూ దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఆకట్టుకునే విజువల్స్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం చిత్రానికి మరింత బలాన్నిచ్చేలా కనిపిస్తోంది. జయకృష్ణ ఘట్టమనేని సినీ అరంగేట్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!