

పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడంతో పాటు సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వాణిజ్య, విహార నౌకలు, చేపల బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని ఖతార్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, దోహా వైపు ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. వాటిలో కొన్నింటిని ఖతార్ వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో కొందరు పౌరులు గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు, ఇరాన్ చర్యలను ఒమన్ తీవ్రంగా ఖండిస్తూ, సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడం, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం అంతర్జాతీయ సంబంధాల్లో అత్యంత కీలకమని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!