

యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో సంచలన ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన వ్యక్తిగత సెంచరీ రికార్డును సృష్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
అంతటితో ఆగకుండా కేవలం 53 బంతుల్లోనే డబుల్ సెంచరీ మార్కును చేరుకున్నట్లు సమాచారం. ఈ ఇన్నింగ్స్‌లో 28 సిక్సర్లు, 7 ఫోర్లు బాదినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గ్లెన్ చాపెల్, మార్క్ పెట్టినీ 27 బంతుల్లో సెంచరీలు సాధించగా, టీ20 క్రికెట్‌లో సాహిల్ చౌహాన్ కూడా 27 బంతుల్లోనే శతకం బాదాడు. ఇప్పుడు లిస్ట్-ఏ క్రికెట్‌లో 28 బంతుల్లో సెంచరీతో వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!