
షోస్

టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి మరోసారి గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు 2026 ఆసియా క్రీడలకు కూడా అతను దూరమయ్యాడు. ఇటీవలే హ్యామ్‌స్ట్రింగ్ గాయం నుంచి కోలుకున్న వరుణ్.. ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన తర్వాత అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో పునరాగమనం చేశాడు. అయితే ఆ మ్యాచ్ అనంతరం సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా గాయం నిర్ధారణ అయింది. దీంతో మిగిలిన టీ20లకు అతడిని తప్పించారు.
తాజా గాయం కారణంగా వరుణ్ చక్రవర్తి ఆసియా క్రీడల జట్టులోనూ చోటు కోల్పోయాడు. అతడి స్థానంలో యువ లెగ్‌స్పిన్నర్, ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్‌ను ఎంపిక చేశారు. ఇది విప్రాజ్‌కు భారత జట్టులో కీలక అవకాశం కానుంది. జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా 2026 ఆసియా క్రీడలు జరుగుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!