

ఏలూరులో మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) పార్థివదేహాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించి నివాళులర్పించారు. పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం నాని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆళ్ల నాని మృతి బాధాకరమని, ఆంధ్రప్రదేశ్ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని లోకేష్ పేర్కొన్నారు. రాజకీయాల్లో నాని వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ హుందాగా వ్యవహరించేవారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఆళ్ల నాని అందించిన సేవలను లోకేష్ స్మరించుకున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలను ప్రస్తావించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ, తన నియోజకవర్గ అభివృద్ధికి నాని కృషి చేశారని తెలిపారు. నాని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!