

బిగ్ బాస్ తెలుగు 10లో పోటీతో పాటు వినోదం కూడా కొనసాగుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం ఫన్‌కు ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. నరేష్, రామ్ ప్రసాద్ తోటి కంటెస్టెంట్లను ఇమిటేట్ చేస్తూ హౌస్‌లో నవ్వులు పూయించారు. త్రిగుణ్, షాలినీ కూడా ఓ ఫన్ టాస్క్‌లో సందడి చేశారు. షాలినీ మౌనంగా ఉంటే.. త్రిగుణ్ ఆమె మాటలకు అర్థం చెబుతూ అభినయంతో అలరించాడు. మరోవైపు వంశీ, సుధీర్, దేబ్జానీ, అమన్, వర్షిణిలను నరేష్, రామ్ ప్రసాద్ తమదైన శైలిలో అనుకరిస్తూ అందరినీ నవ్వించారు. వర్షిణిలా నడవాలని అడిగినప్పుడు.. ‘వర్షిణికే ఇంకా వాక్ చేయడం రాలేదు.. మనం ఏం చేస్తాం’ అంటూ రామ్ ప్రసాద్ వేసిన కౌంటర్‌కు హౌస్‌మేట్స్ అంతా నవ్వుకున్నారు.
ఇక నేటి ఎపిసోడ్‌లో చరణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతడు కెప్టెన్సీ రేసులో కూడా పాల్గొంటాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖేష్, ఝాన్సీ, షాలినీ, రామ్ ప్రసాద్, త్రిగుణ్, దేబ్జానీ కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్ కూడా చేరితే పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు గత కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్, త్రిగుణ్, రామ్ ప్రసాద్ మధ్య శారీరకంగా తలెత్తిన వివాదం చర్చనీయాంశమైంది. ఈ కారణంగా రోహిత్‌ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించినట్లు సమాచారం. ఈ ఘటనపై హోస్ట్ నాగార్జున స్పందిస్తారా? కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. తాజా కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు విజయం సాధించి బిగ్ బాస్ తెలుగు 10 తొలి కెప్టెన్‌గా నిలుస్తారో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!