

యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో జరిగిన ప్రత్యేక సంభాషణను గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆర్సీబీతో పాటు విరాట్ కోహ్లీకి తాను వీరాభిమానినని, అలాంటి వ్యక్తి తనతో మాట్లాడడం జీవితంలో మరపురాని క్షణమని వైభవ్ తెలిపాడు.
కోహ్లీ తనతో ప్రపంచ క్రికెట్ దిగ్గజంలా కాకుండా పెద్దన్నయ్యలా మాట్లాడారని వైభవ్ చెప్పాడు. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, భవిష్యత్తుపై దృష్టి సారించడం వంటి అంశాలపై విలువైన సూచనలు ఇచ్చారని వెల్లడించాడు. ఆ మాటలు తనకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తాయని అన్నాడు. కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన క్యాప్ గురించి మాట్లాడుతూ, అది తనకు ఎంతో ప్రత్యేకమని, ఆరెంజ్ క్యాప్ లేని సమయంలో ఎక్కువగా అదే టోపీని ధరించేవాడినని తెలిపాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!