

అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అక్టోబర్ 29న షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ 29 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జింబాబ్వే బ్యాటర్ టడివనాషే మరుమానిని ఔట్ చేయడం ద్వారా తన 200వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 120 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.
ఈ రికార్డుతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 153 మ్యాచ్‌ల్లో 171 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతడికంటే రషీద్ ఖాన్ 29 వికెట్లు ఆధిక్యంలో ఉన్నాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడం ద్వారా అఫ్గాన్ స్పిన్నర్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!