17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ స్మార్ట్‌ గ్లాసెస్‌ తీసుకొస్తున్న యాపిల్‌..

Writer: Chandrika 04:55 PM, 16 నవంబర్, 2026
ఏఐ స్మార్ట్‌ గ్లాసెస్‌ తీసుకొస్తున్న యాపిల్‌..

టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ తొలిసారిగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్మార్ట్‌ గ్లాసెస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2027 జూన్‌లో జరిగే వార్షిక వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ (WWDC)లో వీటిని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ జర్నలిస్ట్‌ మార్క్‌ గుర్మన్‌ తన కథనంలో వెల్లడించారు. అంతర్గతంగా ‘N50’ అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ గ్లాసెస్‌లో యాపిల్‌ కొత్త సిరి ఏఐ అసిస్టెంట్‌ కీలకంగా పనిచేయనుంది. వీటిలో కెమెరా, మైక్రోఫోన్‌, స్పీకర్లు ఉండే అవకాశం ఉంది. అయితే, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (AR) ఫీచర్లు మాత్రం ఉండవని తెలుస్తోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ ఫ్రేమ్‌ డిజైన్లు, రంగుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని యాపిల్‌ యోచిస్తోంది. వచ్చే ఏడాది జూన్‌లో ఆవిష్కరణ జరగనుండగా, 2027 చివరి నాటికి విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశముంది.

ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ సరళీకరించిన విజన్‌ఓఎస్‌ వెర్షన్‌పై పనిచేయనున్నాయని, పాత యాపిల్‌ వాచ్‌ మోడళ్లలో ఉపయోగించిన చిప్‌ల తరహా ప్రాసెసర్‌ను కలిగి ఉండవచ్చని సమాచారం. వై-ఫై కనెక్టివిటీ ద్వారా ఐఫోన్‌ దగ్గర లేకపోయినా సంగీతం వినడం వంటి కొన్ని సేవలను వినియోగించుకునే అవకాశం ఉండనుంది. మ్యాగ్‌సేఫ్‌ తరహాలో ఫ్లాట్‌, దీర్ఘచతురస్రాకార ఛార్జర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో ఇప్పటికే మెటా ఏఐ స్మార్ట్‌ గ్లాసెస్‌తో మంచి ఆదరణ పొందుతుండగా, గూగుల్‌, స్నాప్‌ సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం 2025 రెండో అర్ధభాగంలో స్మార్ట్‌ గ్లాసెస్‌ మార్కెట్‌ వార్షిక ప్రాతిపదికన 139 శాతం వృద్ధి చెందింది. అయితే కెమెరాలు, మైక్రోఫోన్ల వినియోగం వల్ల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రైవసీని యాపిల్‌ ఎలా కాపాడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్‌..

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్‌..

చైనా పోస్టల్‌ సెంటర్లలో ఏఐ రోబోల హవా..

చైనా పోస్టల్‌ సెంటర్లలో ఏఐ రోబోల హవా..

HMD నుంచి కొత్త 4G ఫ్లిప్ ఫోన్..ఫీచర్లు ఇవే

HMD నుంచి కొత్త 4G ఫ్లిప్ ఫోన్..ఫీచర్లు ఇవే

గెలాక్సీ ఎస్27 సిరీస్ ఉత్పత్తి ప్రణాళికలో ఆసక్తికర మార్పులు

గెలాక్సీ ఎస్27 సిరీస్ ఉత్పత్తి ప్రణాళికలో ఆసక్తికర మార్పులు

డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో 20 శాతం నీటి వృథాకు చెక్..

డిజిటల్ ట్విన్ టెక్నాలజీతో 20 శాతం నీటి వృథాకు చెక్..

ట్యాగ్లు
యాపిల్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌యాపిల్‌ ఏఐ గ్లాసెస్‌యాపిల్‌ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2027సిరి ఏఐయాపిల్‌ ఇంటెలిజెన్స్‌మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌కృత్రిమ మేధస్సుధరించగలిగే టెక్నాలజీఆగ్మెంటెడ్‌ రియాలిటీటెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!