

ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ గిల్లిస్‌తో తన బంధం ముగిసినట్లు ఆమె సోషల్ మీడియా వేదిక Xలో వెల్లడించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం వారం రోజుల్లోనే ప్రేమ బంధం నుంచి విడిపోవాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామం తనకు బాధ కలిగించిందని చెబుతూనే.. మస్క్‌తో మంచి స్నేహితులుగా కొనసాగుతూ తమ పిల్లల బాధ్యతలను కలిసి చూసుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
శివోన్ గిల్లిస్ టెక్ రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. న్యూరాలింక్‌లో చేరకముందు ఆమె ఓపెన్‌ఏఐలో కూడా పనిచేశారు. ఎలాన్ మస్క్, శివోన్ గిల్లిస్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. మస్క్ వ్యక్తిగత జీవితంలో గతంలో జస్టిన్ విల్సన్, టలుల్లా రైలీ, అంబర్ హెర్డ్, గ్రిమ్స్ తదితరులతో సంబంధాలు ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. రచయిత్రి, ఇన్‌ఫ్లూయెన్సర్ యాష్లే సెయింట్ క్లెయిర్ కూడా తన కుమారుడికి మస్క్ తండ్రి అని బహిరంగంగా పేర్కొన్నారు. తాజా పరిణామంతో మరోసారి మస్క్ వ్యక్తిగత జీవితం వార్తల్లో నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!