

బిగ్ బాస్ తెలుగు 10 డే 12 ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్, పోటీ, గొడవలతో ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్‌లో సీజన్ తొలి కెప్టెన్ ఎవరవుతారనే ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్సీ కంటెండర్లుగా ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా వీరిని జైలులో ఉంచగా.. మిగతా సభ్యులు గార్డులుగా వ్యవహరించారు. జైలు గేట్లు తెరిచినప్పుడు కంటెండర్లు గోడ దూకి సేఫ్ జోన్‌కు చేరుకోవాల్సి ఉండగా, గార్డులు తమకు నచ్చని కంటెండర్లను అడ్డుకునే అవకాశం పొందారు.
టాస్క్ మొదలైన తర్వాత హౌస్‌లో పోటీ మరింత తీవ్రంగా మారింది. వర్షిణి, నరేష్, దేబ్జానీ తదితరులు షాలినిని టార్గెట్ చేయగా.. రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్ ముందుగానే గోడ దూకి సేఫ్ జోన్‌కు చేరుకున్నారు. ఝాన్సీని కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పటికీ, షాలినిని ఆపే క్రమంలో ఆమెపై దృష్టి తగ్గింది. దీంతో ఝాన్సీ ముందుకు వెళ్లగలిగింది. మరోవైపు షాలిని తొలి రౌండ్‌లోనే టాస్క్ నుంచి బయటకు వచ్చింది.
తనను టార్గెట్ చేయడంపై షాలిని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన వయసు, అనుభవాన్ని ప్రస్తావిస్తూ వర్షిణి మాట్లాడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కెప్టెన్ కావాలనుకుంటే నేరుగా చెప్పాలని, వయసును ఎందుకు మధ్యలోకి తీసుకువస్తున్నారని ప్రశ్నించింది. ఎక్కువ వయసు ఉన్నవాళ్లే కెప్టెన్ కావాలనే రూల్ ఏమైనా ఉందా అంటూ షాలిని వర్షిణితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది.
ఆ తర్వాత కెప్టెన్సీ రేసు చివరకు రామ్ ప్రసాద్, ఝాన్సీ మధ్యకు చేరింది. ఫైనల్ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన నిబంధనల ప్రకారం కట్టర్‌తో ఫెన్సింగ్‌ను కట్ చేసి అవతలి వైపుకు చేరుకుని కెప్టెన్సీ జెండాను ఎగరేయాల్సి ఉంది. ఈ పోటీలో ఝాన్సీ ముందుగా టాస్క్‌ను పూర్తి చేసి విజయం సాధించింది. దీంతో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ అవతరించింది. బిగ్ బాస్ ఆమెను అభినందించి ప్రత్యేక కెప్టెన్ గదిని కేటాయించారు. మొత్తంగా కెప్టెన్సీ పోటీతో పాటు వర్షిణి–షాలిని వివాదం ఈరోజు ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!