
గాసిప్స్

రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన అల్ట్రా-ఫాస్ట్ డెలివరీ సేవ ‘అమెజాన్ నౌ’ను మరింత విస్తరించింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ సేవల నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసి దేశవ్యాప్తంగా 120కి పైగా నగరాలకు విస్తరించినట్లు సంస్థ ప్రకటించింది.
విశాఖపట్నం, మంగళూరు, కొచ్చి, భువనేశ్వర్, అమృత్‌సర్, జలంధర్, అంబాలా, మణిపాల్ సహా పలు నగరాల్లో తాజాగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. పండగ సీజన్‌లో పెరగనున్న వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడంతో పాటు వేగవంతమైన డెలివరీ సేవల నెట్‌వర్క్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ విస్తరణ చేపట్టినట్లు పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!