

హైదరాబాద్‌కు చెందిన రత్నదీప్ రిటైల్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రమోటర్లు సందీప్ అగర్వాల్, మనీశ్ భార్తియా, మితేశ్ భార్తియా, యశ్ అగర్వాల్, కవిత అగర్వాల్ తమ వాటాకు చెందిన 1.49 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు.
తాజా ఈక్విటీ ద్వారా వచ్చే నిధుల్లో రూ.260 కోట్లను కొత్త స్టోర్ల ఏర్పాటుకు, రూ.40 కోట్లను రుణాల చెల్లింపులకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ వ్యాపార అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. అదనంగా రూ.80 కోట్ల ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ చేపట్టే యోచన కూడా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.2,223 కోట్ల ఆదాయం, రూ.36.7 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
ఇదిలా ఉండగా మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఐపీఓ బాట పట్టాయి. కార్ల్స్‌బర్గ్ ఇండియా సుమారు రూ.6,650 కోట్ల, స్వర బేబీ ప్రొడక్ట్స్ రూ.1,000 కోట్ల, పార్లే ప్రొడక్ట్స్ రూ.9,500 కోట్లకు పైగా సమీకరించే లక్ష్యంతో ఐపీఓలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!