

బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్, ప్రాపర్టీ కొనుగోలు, హోటల్ బుకింగ్ వంటి సేవల కోసం పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పత్రాలను సమర్పించడం సాధారణమే. అయితే ఏజెంట్లు లేదా ఉద్యోగులు వ్యక్తిగత వాట్సాప్ నంబర్లకు ఈ పత్రాలను పంపాలని కోరినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అవి వ్యక్తిగత ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో సేవ్ కావడంతో వాటి కాపీలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. వ్యక్తిగత, ఆర్థిక వివరాలు దుర్వినియోగమైతే గుర్తింపు చోరీ, అనధికార కాల్స్, మెసేజ్‌లు, ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఉంది.
భారత డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం (DPDP Act) వ్యక్తిగత డేటాను స్పష్టమైన ఉద్దేశంతో సేకరించడం, బాధ్యతగా నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. RBI 2024-25 వార్షిక నివేదిక ప్రకారం రూ.36,014 కోట్ల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి. అందువల్ల అవసరమైన పత్రాలను వ్యక్తిగత వాట్సాప్ నంబర్లకు పంపకుండా, సంబంధిత సంస్థ అధికారిక వెబ్‌సైట్, సురక్షిత అప్‌లోడ్ పోర్టల్ లేదా డిజిటల్ వెరిఫికేషన్ వ్యవస్థను ఉపయోగించడం మంచిది. డేటాను ఎవరు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!