
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి తగ్గడంతో సురక్షిత పెట్టుబడులుగా భావించే బంగారం, వెండిపై డిమాండ్ తగ్గి ధరలు క్షీణించాయి. ఈ పరిణామం కొనుగోలుదారులకు కొంత ఊరట కలిగించింది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,650 తగ్గి ₹1,45,860కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,350 తగ్గి ₹1,33,700గా నమోదైంది. కేజీ వెండి ధర కూడా రూ.15,000 తగ్గి ₹2,55,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!