

ఈరోజూ బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఉదయం 10:00 గంటల సమయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,280, 22 క్యారెట్ల బంగారం రూ.1,35,000, 18 క్యారెట్ల బంగారం రూ.1,10,460గా నమోదైంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,420, 22 క్యారెట్లు రూ.1,35,150, 18 క్యారెట్లు రూ.1,10,610గా ఉంది. చెన్నైలో 18 క్యారెట్ల బంగారం రూ.1,13,150గా ఉండగా, ముంబై, కోల్‌కతా, కేరళ, అహ్మదాబాద్ నగరాల్లో కూడా స్వల్ప తేడాలతో ధరలు నమోదయ్యాయి.
గమనిక: బంగారం ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!