

గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,470 పెరిగి రూ.1,53,160కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,350 పెరిగి రూ.1,40,400గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.2.7 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా సగటున బంగారం ధరలు రూ.1,450 పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,910కు, 22 క్యారెట్ల బంగారం రూ.1,42,000కు చేరుకుంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,53,160గా, 22 క్యారెట్ల ధర రూ.1,40,400గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,53,310కు పెరగగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,550కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ధర 0.6 శాతం పెరిగి 4,330 డాలర్లను దాటింది. వెండి ధర మాత్రం 1 శాతం తగ్గి 67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది.
గమనిక: బంగారం కొనుగోలు చేసే ముందు ఈరోజు ధరలను తప్పనిసరిగా పరిశీలించండి. మార్కెట్ మార్పులను గమనించి సరైన సమయంలో కొనుగోలు చేయండి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!