

భారత క్రికెట్ పురుషుల జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించగా, మాజీ దేశవాళీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో ఆయనే టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా నియమితులవుతారా అనే ఆసక్తి నెలకొంది.
1968లో అసోంలోని దిగ్‌బోయ్‌లో జన్మించిన సుభదీప్ ఘోష్ దేశవాళీ క్రికెట్‌లో అసోం, రైల్వేస్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచింగ్‌లో మంచి గుర్తింపు సంపాదించి, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ), భారత మహిళల జట్టు, ఇండియా-ఏ, అండర్-19 జట్లతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు. దేశవాళీ, జాతీయ, ఐపీఎల్ స్థాయిల్లో ఆయనకు ఉన్న విస్తృత అనుభవం కారణంగా టీ దిలీప్ స్థానంలో ఆయనే ప్రధాన ఫేవరెట్‌గా భావిస్తున్నారు. శ్రీలంక పర్యటనకు ముందు కొత్త ఫీల్డింగ్ కోచ్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!