

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తూ మే నెలలో అత్యధికంగా రష్యా ముడి చమురు దిగుమతి చేసుకున్న రెండో దేశంగా నిలిచింది. ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదిక ప్రకారం, మే నెలలో భారత్ రష్యా నుంచి మొత్తం 5.8 బిలియన్ యూరోల విలువైన ఇంధనం, బొగ్గును కొనుగోలు చేసింది. ఇందులో 83 శాతం వాటా ముడి చమురుదే కావడం విశేషం.
ఏప్రిల్‌తో పోలిస్తే మేలో రష్యా ముడి చమురు దిగుమతులు 21 శాతం పెరిగాయి. వడినార్, జామ్‌నగర్ రిఫైనరీల కొనుగోళ్లు గణనీయంగా పెరగగా, ప్రభుత్వ రంగంలోని న్యూ మంగళూరు, విశాఖపట్నం రిఫైనరీలు కూడా రష్యా చమురు దిగుమతులను మళ్లీ ప్రారంభించి విస్తరించాయి. రష్యా చమురుతో తయారైన పెట్రోలియం ఉత్పత్తులు భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. జామ్‌నగర్ రిఫైనరీ నుంచి రిలయన్స్ అమెరికాకు ఇంధనాన్ని ఎగుమతి చేసినట్లు నివేదిక పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!