

విక్టరీ వెంకటేశ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 (ఏకే 47)’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వెంకటేశ్ పోషిస్తున్న చిట్టిబాబు, శ్రీనిధి శెట్టి నటిస్తున్న స్వర్ణ పాత్రలను పరిచయం చేసిన చిత్రబృందం, తాజాగా బాలనటి యువినా పార్థవి పోషిస్తున్న ‘సంపూర్ణ’ పాత్రను ప్రత్యేక వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
చిట్టిబాబు–స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తెగా కనిపించే సంపూర్ణ పాత్ర అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో కథకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో నారా రోహిత్, నివేతా పేతురాజ్, రాజా ప్రజ్వల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!