
క్రీడలు

జూన్ నెలలో రష్యా నుంచి 5.5 బిలియన్ యూరోల విలువైన ఇంధనం, బొగ్గును కొనుగోలు చేసి భారత్ రష్యా ముడి చమురు దిగుమతుల్లో రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచిందని సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) తన తాజా నివేదికలో వెల్లడించింది. మే నెలతో పోలిస్తే ఈ దిగుమతులు 34 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఇంధనంలో 83 శాతం ముడి చమురే ఉండటం విశేషం. మరోవైపు, భారత్, తుర్కియే, బ్రూనై, జార్జియా దేశాలు రష్యా చమురుతో శుద్ధి చేసిన ఇంధనాన్ని ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేశాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రధాన కొనుగోలుదారులుగా నిలిచాయి. బ్రిటన్ మినహాయింపు ఇవ్వడంతో గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ నుంచి తొలిసారిగా జెట్ ఇంధన కార్గో యూకేకు చేరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!