Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

Writer: Sreekanth Reddy 02:28 PM, 11 జులై, 2026
వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

మహీంద్రా తన ఎస్‌యూవీ శ్రేణి ధరలను మరోసారి పెంచింది. ముడిసరుకు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. గరిష్ఠంగా 2.7 శాతం వరకు ధరలు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.5 శాతం వరకు ధరలు పెంచిన మహీంద్రా.. ఇప్పుడు రెండోసారి రేట్లు సవరించింది. స్కార్పియో ఎన్‌ మినహా దాదాపు అన్ని పెట్రోల్‌, డీజిల్‌ ఎస్‌యూవీలపై ఈ పెంపు వర్తిస్తుంది.

బొలెరోపై అత్యధికంగా రూ.49 వేల వరకు ధర పెరిగింది. థార్‌ 3-డోర్‌, థార్‌ రాక్స్‌, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో, బొలెరో నియో, స్కార్పియో క్లాసిక్‌, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో మోడళ్ల ధరలు కూడా పెరిగాయి. అయితే స్కార్పియో ఎన్‌ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. తాజా ధరల ప్రకారం ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ప్రారంభ ధర రూ.7.79 లక్షలు కాగా, థార్‌ రాక్స్‌ ధర రూ.12.52 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌యూవీ 7ఎక్స్‌వో ధర రూ.13.99 లక్షల నుంచి మొదలవుతుంది.

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మాత్రం ఎక్స్‌ఈవీ 9ఎస్‌ ధరను మాత్రమే పెంచింది. దీని ప్రారంభ ధర రూ.19.95 లక్షల నుంచి రూ.20.65 లక్షలకు చేరింది. అంటే ఒక్కసారిగా రూ.70 వేల పెరిగింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ, బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇటీవల టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, బీవైడీ వంటి కంపెనీలు కూడా ధరలు పెంచిన నేపథ్యంలో మహీంద్రా కూడా అదే బాటలో నడిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

ట్యాగ్లు
మహింద్రా వెహికిల్స్ ధరలుఎస్ యూ వీకార్ మార్కెట్ఆనంద్ మహింద్రాఇండియా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి
రాజకీయాలు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
రాజకీయాలు

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

ముంబయిలో పవన్ కళ్యాణ్‌కు భారీ సర్జరీ..
జనరల్

ముంబయిలో పవన్ కళ్యాణ్‌కు భారీ సర్జరీ..

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..
జనరల్

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
బిజినెస్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత
రాజకీయాలు

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి బాధాకరం - కవిత

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు, కొత్త ఫీచర్లు
జనరల్

ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో మార్పులు, కొత్త ఫీచర్లు

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ
గాసిప్స్

హీరో రామ్ తో పెళ్లి, డేటింగ్ పై స్పందించిన హీరోయిన్ భాగ్యశ్రీ

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా
బిజినెస్

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

ఆసిస్ లో   ఐపీఎల్ మ్యాచ్ లు
క్రీడలు

ఆసిస్ లో ఐపీఎల్ మ్యాచ్ లు

రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్
జనరల్

రాధా గాయత్రి మృతి కేసులో భర్త అరెస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!