

సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక మైలురాయిని చేరుకుంది. చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లోని టీ-వర్క్స్‌లో ప్రారంభమైంది. జపాన్‌కు చెందిన తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ హబ్‌తో అత్యాధునిక సీఎంపీ ప్యాడ్ సాంకేతికత తొలిసారిగా దేశంలో అందుబాటులోకి రావడం విశేషం.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే అగ్రగామి సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, పరిశ్రమలకు శిక్షణ, పరిశోధన, సాంకేతిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో వచ్చే 18 నుంచి 24 నెలల్లో దేశీయంగానే సీఎంపీ ప్యాడ్ల తయారీని ప్రారంభించే లక్ష్యంతో సంయుక్త పరిశోధనలు చేపడతామని వెల్లడించారు. పరిశోధన నుంచి చిప్ తయారీ వరకు సమగ్ర సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు జపాన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!