
జనరల్

వినియోగదారుల గోప్యత, ఇమేజ్ స్క్రాపింగ్, అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలను వినియోగించే అవకాశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవడంతో ‘మ్యూజ్ ఇమేజ్’ అనే అధునాతన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్‌ను ఉపసంహరిస్తున్నట్లు మెటా ప్రకటించింది. మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన తొలి మీడియా జనరేషన్ మోడల్ ఇదే కావడం విశేషం.
ఈ టూల్ ద్వారా పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఉన్న ఫొటోలను ఆధారంగా చేసుకుని ఏఐ చిత్రాలను రూపొందించే అవకాశం ఉండేది. దీంతో వ్యక్తుల అనుమతి లేకుండానే వారి ముఖాలు ఏఐ రూపొందించిన చిత్రాల్లో కనిపించే అవకాశం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏఐ రూపొందించిన చిత్రాలకు వాటర్‌మార్క్ ఉంటుందని మెటా తెలిపినా, గోప్యతపై వినియోగదారుల ఆందోళనలు తగ్గకపోవడంతో చివరకు ఈ టూల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!