

తత్కాల్ టికెట్ల కోసం రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడంతో పాటు దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రైల్వే టోకెన్ విధానంను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ఆగస్టు 1, 2026 నుంచి తొలి దశలో వెస్ట్ సెంట్రల్ రైల్వే కోటా డివిజన్ పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్లలో అమల్లోకి రానుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో మార్పు లేకపోయినా, ముందుగా టోకెన్ తీసుకున్న ప్రయాణికులకే కౌంటర్ వద్ద అవకాశం ఉంటుంది.
కొత్త నిబంధనల ప్రకారం ఏసీ తరగతులకు ఉదయం 8:30 నుంచి 9:00 గంటల వరకు, నాన్-ఏసీ తరగతులకు ఉదయం 9:30 నుంచి 10:00 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. తమ కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకునే వారికి కేటగిరీ-ఏ కింద తొలి ప్రాధాన్యం ఉంటుంది. టోకెన్‌పై ప్రయాణికుడి వివరాలు ముద్రించబడతాయి. అలాగే ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా రైల్వే శాఖ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!