

శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు కోసం భారత జట్టులో కొత్తగా ఎంపికైన ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు తప్పకుండా అవకాశం ఇవ్వాలని మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. సారాంశ్ భిన్నమైన ఆఫ్ స్పిన్నర్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లోనూ విలువైన పరుగులు చేయగలడని పేర్కొన్నారు. తన ఎంపిక చేసిన తుది జట్టులో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్తో పాటు సారాంశ్ జైన్ కూడా ఉండాలని సూచించారు. అలాగే యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగాలని, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్తో పాటు సాయి సుదర్శన్ ఫిట్‌గా ఉంటే అతడికి, లేకపోతే దేవదత్ పడిక్కల్కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
ఇక యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై గతంలో చేసిన వ్యాఖ్యల గురించి కూడా అశ్విన్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, వాటి వెనుక కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. జట్టుతో పాటు ఉంటూ సీనియర్ ఆటగాళ్లను గమనించడం ద్వారా వైభవ్ మరింత నేర్చుకునే అవకాశం ఉంటుందని మాత్రమే చెప్పానన్నారు. అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజంగా ఎదగనివ్వాలని, భవిష్యత్తులో అతడు భారత క్రికెట్‌కు గొప్ప ఆస్తిగా మారుతాడనే నమ్మకం తనకు ఉందని అశ్విన్ తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!