27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

Writer: Nithish 06:04 AM, 27 సెప్టెంబర్, 2026
ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

అనిశ్చిత మార్కెట్‌ పరిస్థితులు, వ్యూహాత్మక కారణాలతో ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ అనుబంధ సంస్థ ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ వెంచర్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌వీఎల్‌) తన హోటల్‌ వ్యాపారానికి సంబంధించిన రూ.2,700 కోట్ల ఐపీఓ ప్రణాళికను ఉపసంహరించుకుంది. పీహెచ్‌వీఎల్‌ 2025 ఏప్రిల్‌లో సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. తాజాగా కంపెనీ బోర్డు డీఆర్‌హెచ్‌పీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. భవిష్యత్తులో మార్కెట్‌ పరిస్థితులు అనుకూలిస్తే కొత్త డీఆర్‌హెచ్‌పీని దాఖలు చేసే అవకాశముందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాకు చెందిన సీపీపీఐబీ తమ ఆతిథ్య విభాగంలో రూ.3,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రకటించింది.

మరోవైపు పలు కంపెనీలు ఐపీఓల కోసం సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. కోల్‌కతాకు చెందిన అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ రూ.1,800 కోట్ల ఐపీఓకు, జే ఇన్‌ఫ్రాటెక్‌ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతోపాటు ప్రమోటర్ల ఓఎఫ్‌ఎస్‌తో కూడిన ఐపీఓకు దరఖాస్తు చేశాయి. అరేటే 22 లిమిటెడ్‌ రూ.440 కోట్ల తాజా షేర్ల జారీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. బాంగంగా గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ రూ.720 కోట్ల ఐపీఓలో భాగంగా రూ.540 కోట్ల తాజా షేర్ల జారీ, రూ.180 కోట్ల ఓఎఫ్‌ఎస్‌ను ప్రతిపాదించింది. డియాన్‌ ఎనర్జీ కూడా ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇక విశాల్‌ నిర్మితి ఐపీఓ సెప్టెంబర్‌ 30న ప్రారంభమై అక్టోబర్‌ 5న ముగియనుంది. ధరల శ్రేణిని రూ.208–220గా నిర్ణయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం

తుది దశకు ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం

మ్యూచువల్ ఫండ్స్‌లో అదిరిపోయే రిటర్న్స్.. ఏడాదిలోనే భారీ లాభాలు!

మ్యూచువల్ ఫండ్స్‌లో అదిరిపోయే రిటర్న్స్.. ఏడాదిలోనే భారీ లాభాలు!

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ట్యాగ్లు
ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీఐపీఓసెబీస్టాక్‌ మార్కెట్‌అన్మోల్‌ ఇండస్ట్రీస్‌జే ఇన్‌ఫ్రాటెక్‌అరేటే 22బాంగంగా గోల్డ్‌ అండ్‌ డైమండ్‌విశాల్‌ నిర్మితి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
జనరల్

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా
జనరల్

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు
జనరల్

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం
బిజినెస్

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌
క్రీడలు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!