

టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య బోర్డురూమ్ వివాదం మరింత ముదిరింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు సెప్టెంబర్ 17న బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్ వ్యతిరేకించింది. తమ నామినీ డైరెక్టర్ల నుంచి అవసరమైన అనుకూల మద్దతు లభించలేదని, అందువల్ల చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానానికి చట్టపరమైన ప్రభావం లేదని ట్రస్ట్స్ పేర్కొంది. టాటా సన్స్‌లో సుమారు 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్.. ఈ వ్యవహారంలో న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తోంది.
మరోవైపు ఈ వివాదం కోర్టుకు వెళితే న్యాయపరమైన ఖర్చులను ఎవరు భరిస్తారనే అంశం కూడా చర్చకు వచ్చింది. టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ (TEDT) ట్రస్టీ మెహ్లీ మిస్త్రీ.. టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య వివాదానికి సంబంధించిన న్యాయ ఖర్చుల కోసం TEDT నిధులను వినియోగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. టాటా సన్స్‌లో TEDT వాటాదారు కాదని ఆయన పేర్కొన్నారు. చంద్రశేఖరన్ పునర్నియామకం, టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణం వంటి అంశాలపై కొనసాగుతున్న విస్తృత వివాదానికి ఇది మరో కీలక పరిణామంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!