4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇల్లు కొనేముందు గ్రీన్‌ రేటింగ్‌ చూడండి..

Writer: Chandrika 04:08 PM, 4 నవంబర్, 2026
ఇల్లు కొనేముందు గ్రీన్‌ రేటింగ్‌ చూడండి..

వస్తువులు కొనుగోలు చేయాలన్నా, హోటల్‌ బుక్‌ చేసుకోవాలన్నా, సినిమా చూడాలన్నా రేటింగ్స్‌, రివ్యూలను పరిశీలించడం సాధారణం. మరి జీవితంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటైన ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యత, పర్యావరణ ప్రమాణాలను ఎలా తెలుసుకోవాలి? ఇందుకు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) రేటింగ్స్‌ ఉపయోగపడతాయి. హరిత భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) 2001లో హైదరాబాద్‌ కేంద్రంగా ఐజీబీసీని ఏర్పాటు చేసింది. వరల్డ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌కు అనుబంధంగా ఉన్న ఈ సంస్థ భవనాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణలో పాటించే పర్యావరణ ప్రమాణాలను పరిశీలించి సర్టిఫికేషన్‌ ఇస్తుంది. నివాస భవనాలకు సర్టిఫైడ్‌, సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినం అనే నాలుగు స్థాయిల్లో రేటింగ్స్‌ అందిస్తుంది. నీరు, విద్యుత్తు ఆదా, వాననీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ, కాలుష్య ఉద్గారాల తగ్గింపు, పర్యావరణహిత నిర్మాణ సామగ్రి వినియోగం వంటి అంశాల ఆధారంగా ఈ రేటింగ్స్‌ కేటాయిస్తారు. వ్యక్తిగత ఇళ్లకు కూడా గ్రీన్‌ హోమ్స్‌ విభాగంలో సర్టిఫికేషన్‌ పొందే అవకాశం ఉంది.

ఈ నాలుగు రేటింగ్స్‌లో సర్టిఫైడ్‌ ప్రాథమిక స్థాయి కాగా, కనీస పర్యావరణ ప్రమాణాలను పాటించే భవనాలకు లభిస్తుంది. నిర్మాణ దశలోనే ప్రమాణాలు పరిశీలించి ఇచ్చే గుర్తింపును ప్రీ సర్టిఫికేషన్‌గా పిలుస్తారు. సిల్వర్‌ స్థాయికి వాననీటి నిల్వ, నీటి పొదుపు పరికరాలు, స్థానిక మొక్కలు, రీసైకిల్‌ చేసిన నిర్మాణ సామగ్రి, వ్యర్థాల నిర్వహణ వంటి అదనపు చర్యలు అవసరం. గోల్డ్‌ రేటింగ్‌ కోసం విద్యుత్తు, నీటి ఆదాతోపాటు వ్యర్థాల శుద్ధి, సహజ గాలి, వెలుతురు ప్రసరణ, మెరుగైన గాలి నాణ్యత, తక్కువ వీవోసీ కలిగిన పెయింట్లు, గ్లూల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్లాటినం అత్యున్నత స్థాయి రేటింగ్‌. భవన ప్రాంగణంలో సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి ప్లాంటు, సౌర వాటర్‌ హీటింగ్‌, వెదురు వంటి త్వరగా పునరుత్పత్తి అయ్యే నిర్మాణ సామగ్రి వినియోగం దీనికి అవసరం. హరిత భవనాల వల్ల సుమారు 30 శాతం నీరు, 40 శాతం వరకు విద్యుత్తు ఆదా చేయవచ్చని అంచనా. అంతేకాకుండా ఆరోగ్యకరమైన నివాస వాతావరణం లభించడంతోపాటు ఇలాంటి ఇళ్లకు మార్కెట్‌లో అధిక ధర, అద్దె వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

దీపావళికి ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

దీపావళికి ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

స్టాక్‌అల్‌లో అనధికార ట్రేడింగ్‌ కలకలం..

స్టాక్‌అల్‌లో అనధికార ట్రేడింగ్‌ కలకలం..

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

ల్యాబ్‌లో బంగారం తయారీ సాధ్యమైతే ధరలు తగ్గుతాయా?

ల్యాబ్‌లో బంగారం తయారీ సాధ్యమైతే ధరలు తగ్గుతాయా?

ట్యాగ్లు
ఐజీబీసీహరిత భవనాలుగ్రీన్‌ హోమ్‌ సర్టిఫికేషన్‌ఇల్లు కొనుగోలుసీఐఐపర్యావరణహిత నిర్మాణంప్లాటినం రేటింగ్‌గోల్డ్‌ రేటింగ్‌విద్యుత్తు ఆదానీటి సంరక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..
జనరల్

హర్మూజ్‌లో భారత్‌కు ప్రత్యేక మినహాయింపు..

ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత
క్రీడలు

ఐదేళ్ల తర్వాత వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పీవీ సింధు అర్హత

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు  ఏర్పాట్లు పూర్తి
రాజకీయాలు

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ఎన్నికల కమిషనర్ల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

ఎన్నికల కమిషనర్ల రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ విడుదల.. కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకునే నటన
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ విడుదల.. కార్తీక్‌గా శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకునే నటన

యాప్స్‌కు బదులుగా ఏఐ ఏజెంట్లు.. ఐఫోన్‌కు పోటీగా ‘సైక్లోన్‌’ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

యాప్స్‌కు బదులుగా ఏఐ ఏజెంట్లు.. ఐఫోన్‌కు పోటీగా ‘సైక్లోన్‌’ స్మార్ట్‌ఫోన్‌

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు
బిజినెస్

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక సదర్ - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక సదర్ - సీఎం రేవంత్ రెడ్డి

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!
జనరల్

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం
జనరల్

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..
టెక్నాలజీ

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్
రాజకీయాలు

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!