

స్టాక్ మార్కెట్‌లో టాటా సన్స్ షేర్ల నమోదును తప్పించుకునే ప్రత్యామ్నాయంగా కంపెనీని పునర్‌వ్యవస్థీకరించేందుకు టాటా ట్రస్టులు ప్రతిపాదన తీసుకొచ్చాయి. టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్టులు.. టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ సంస్థలను టాటా సన్స్‌లో విలీనం చేయాలని సూచించాయి. ఈ పునర్‌వ్యవస్థీకరణ ద్వారా టాటా సన్స్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ, ప్రధాన పెట్టుబడి సంస్థగా పరిగణించే నిబంధనల పరిధి నుంచి బయటపడే అవకాశం ఉందని ట్రస్టులు పేర్కొన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్‌లో షేర్ల నమోదుకు దారితీసిన నియంత్రణ నిబంధనలు వర్తించకుండా ఉండొచ్చని భావిస్తున్నారు.
టాటా సన్స్ పాలక మండలి ఇప్పటికే భారతీయ రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా షేర్ల నమోదుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ట్రస్టుల తాజా ప్రణాళిక ప్రకారం విలీనానికి టాటా సన్స్ పాలక మండలి ఆమోదంతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంకు ముందస్తు అభ్యంతర రహిత ధ్రువీకరణ అవసరం. 2026 మార్చి 31 నాటికి ప్రతిపాదిత విలీన సంస్థకు రూ.1.05 లక్షల కోట్ల నిర్వహణ ఆదాయం ఉంటుందని, ఆర్థిక ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం ఆదాయంలో 64.3 శాతంగా ఉంటుందని టాటా ట్రస్టులు తెలిపాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!