25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

Writer: Nithish 06:27 AM, 25 ఆగస్టు, 2026
పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

టాటా గ్రూప్‌కు చెందిన దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే ఏజీకి చెందిన ఐటీ అనుబంధ సంస్థ ఎంహెచ్‌పీ మేనేజ్‌మెంట్‌ ఉండ్‌ ఐటీ-బెరాటుంగ్‌ జీఎంబీహెచ్‌ (ఎంహెచ్‌పీ)లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్‌లో ఎంహెచ్‌పీ ఎంటర్‌ప్రైజ్‌ విలువ 320 మిలియన్‌ యూరోలు (సుమారు రూ.3,574 కోట్లు). టీసీఎస్‌, పోర్షే మధ్య కుదిరిన 1.25 బిలియన్‌ యూరోల (దాదాపు రూ.14,000 కోట్లు) విలువైన ఐదేళ్ల వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ కొనుగోలు జరుగుతోంది. యూరోపియన్‌ కమిషన్‌తో పాటు జర్మనీ, రొమేనియా నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత 3-4 నెలల్లో లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంది.

జర్మనీలోని లుడ్విగ్స్‌బర్గ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎంహెచ్‌పీలో సుమారు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆటోమోటివ్‌, తయారీ, ఏరోస్పేస్‌, రక్షణ, ఇంధన, ప్రభుత్వ రంగాలకు మేనేజ్‌మెంట్‌, ఐటీ కన్సల్టింగ్‌ సేవలను అందిస్తున్న ఈ సంస్థ 2025లో 742 మిలియన్‌ యూరోల (సుమారు రూ.8,300 కోట్లు) టర్నోవర్‌ నమోదు చేసింది. పోర్షే కోసం టీసీఎస్‌ ప్రత్యేకంగా ‘ఏఐ మొబిలిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటు చేయనుంది. తయారీ, ఇంజినీరింగ్‌, కార్యకలాపాలు, కస్టమర్‌ అనుభవంలో ఏఐ వినియోగాన్ని పెంచడమే దీని లక్ష్యం. ఆటోమోటివ్‌ రంగంలో ఏఐ, సాఫ్ట్‌వేర్‌, డేటా ఆధారిత మార్పులను వేగవంతం చేసేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీసీఎస్‌ ఎండీ, సీఈఓ కె. కృతివాసన్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

బ్యాంక్ హాలిడేస్‌పై కీలక అప్‌డేట్ ...

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

1 పైసా బిడ్‌తో సంచలనం.. జోస్ అలుక్కాస్‌కు గోల్డ్ రింగ్ టెండర్

ట్యాగ్లు
టీసీఎస్‌టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌పోర్షేఎంహెచ్‌పీఐటీ రంగంటెక్నాలజీఏఐ మొబిలిటీఆటోమోటివ్‌ టెక్నాలజీటాటా గ్రూప్‌వ్యాపార వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్
జనరల్

ఈవీఎంలకు ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్షన్ సాధ్యం కాదు - సీఈసీ జ్ఞానేష్ కుమార్

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌
సినిమాలు

‘టాక్సిక్‌’లో యశ్‌ 2.O చూస్తారు - దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు
జనరల్

కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ కీలక ఆరోపణలు

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
జనరల్

అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం
జనరల్

జెన్‌ జీతో కోటంరెడ్డి మాటామంతీ.. నేటి నుంచే వినూత్న కార్యక్రమం

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన
జనరల్

నేడు నిజామాబాద్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
జనరల్

ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌
జనరల్

హెచ్‌-1బీ ఆశావహులకు ట్రంప్‌ సర్కారు మరో షాక్‌

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం
జనరల్

దేవుని కడప ఆలయంలో మహాసంప్రోక్షణకు వైభవంగా శ్రీకారం

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు
జనరల్

ప్రజలు కార్యాలయాలకు రాకుండానే సేవలు.. అధికారులకు చంద్రబాబు సూచనలు

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌
బిజినెస్

పోర్షే ఐటీ సంస్థను కొనుగోలు చేయనున్న టీసీఎస్‌

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌
బిజినెస్

భారత్‌-అమెరికా రక్షణ బంధం మరింత బలోపేతం - సెర్గియో గోర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!